: ట్రంప్.. ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రసంగాలు చేయకు: ఒబామా


'ట్రంప్.. ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రసంగాలు చేయకు' అంటూ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హితవు పలికారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం చివరి ఘట్టానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో అధ్యక్ష బరిలో ఉన్న డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీకి మద్దతుగా కొలంబస్ లో నిర్వహించిన ర్యాలీలో ఒబామా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రత్యర్థులను జైల్లో పెడతాననడం, పత్రికా స్వాతంత్ర్యంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, మహిళలు నేతలుగా మారడాన్ని ట్రంప్ ప్రశ్నించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇతర మత విశ్వాసాలు కలిగిన ప్రజలపై అవాకులు చవాకులు పేలుతున్న ట్రంప్ కనుక ఒకవేళ అధ్యక్షుడిగా ఎన్నికైతే పరిస్థితులు ఎలా ఉంటాయోనని ఒబామా ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్ష పదవికి హిల్లరీ క్లింటన్ ఉత్తమమని అన్నారు.

  • Loading...

More Telugu News