: ఢిల్లీలో టెన్షన్.. పోలీసుల అదుపులో మళ్లీ రాహుల్


వన్ ర్యాంక్- వన్ పెన్షన్ విషయమై ఆత్మహత్య చేసుకున్న మాజీ సైనికోద్యోగి రామ్ కిషన్ గ్రేవాల్ కుటుంబసభ్యులను పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని పోలీసులు మధ్యాహ్నం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కన్నాట్ ప్లేస్ లో రాహుల్ ఆందోళనకు దిగారు. రాహుల్ తో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలు అక్కడ ఉన్నారు. రాహుల్ ను పోలీసులు మళ్లీ అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కాంగ్రెస్ నేతలు, నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News