: గౌతమితో విడిపోవడంపై వస్తున్న ప్రకటనలు నావి కావు: కమలహాసన్


గౌతమితో పదమూడు సంవత్సరాల తన సహజీవనం బ్రేకప్ అవడంపై తాను ఎటువంటి ప్రకటనా చేయలేదని ప్రముఖ నటుడు కమలహాసన్ పేర్కొన్నారు. తన పేరిట తప్పుడు ప్రకటనలు వస్తున్నాయని, అవన్నీ అవాస్తవమని, వాటిని నమ్మవద్దని కమల్ కోరారు. ఈ మేరకు కమల్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తమిళంలో ట్వీట్ చేశారు. ఈ విషయమై కొందరు తన పేరిట ప్రకటనలు విడుదల చేయడం, వాటిని ప్రచారం చేయడం అనాగరిక చర్య అని, ఇప్పట్లో తాను ఎటువంటి ప్రకటనా జారీ చేయనని కమల్ స్పష్టం చేశారు. కాగా, గౌతమికి ఎలా ఉండాలనిపిస్తే అలా ఉండాలని, తన ఆనందమే తాను కోరుకుంటున్నానని కమల్ ప్రకటించినట్లుగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ వార్తలను నమ్మవద్దని కమలహాసన్ ట్వీట్ చేయాల్సి వచ్చింది.

  • Loading...

More Telugu News