: ‘యువరాజయినా నేరానికి శిక్ష అనుభవించాల్సిందే’.. సౌదీ అరేబియా యువరాజును గదిలో బంధించి, చితక్కొట్టారు!
కోపంలో ఒకరిని కాల్చి చంపాడన్న కారణంగా యువరాజుకు ఇటీవలే సౌదీ అరేబియా యువరాజుకు మరణశిక్ష అమలు చేసిన సంగతి తెలిసిందే. అల్ సౌద్ రాజవంశీకుల పాలనలో ఉన్న సౌదీ అరేబియాకు ప్రస్తుతం సల్మాన్ బిన్ అబ్దులాజీజ్ రాజుగా ఉన్నారు. రాజ కుటుంబం చాలా పెద్దదే కావడంతో అందులో యువరాజులు కూడా చాలా మందే ఉన్నారు. సౌదీ అరేబియా రాజు తప్పు చేసిన మరో యువరాజును తాజాగా శిక్షించాడు. ఓ నేరం చేసినందుకు జెడ్డాలోని కారాగారంలో ఓ గదిలో యువరాజుని బంధించి, చితక్కొట్టారు. అంతేకాదు, రెండు వారాల వరకు ఆ యువరాజు జైలులోనే గడుపుతాడని సౌదీ న్యాయశాఖ పేర్కొంది. అయితే, యువరాజు చేసిన నేరం ఏంటో వివరించలేదు.