: సోనియా నివాసాన్ని ముట్టడించిన టీఎన్ జీవో నేతలు


ఢిల్లీలో తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నివాసాన్ని ముట్టడించేందుకు యత్నించారు. అయితే, వీరిని పోలీసులు నిలువరించారు. ఈ సంఘటనతో సోనియా నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. తెలంగాణ నినాదాలు చేస్తూ సోనియాను కలిసేందుకు అనుమతినివ్వాలని టీఎన్ జీవో నేతలు విజ్ఞప్తి చేశారు. దాంతో సోనియాను కలిసేందుకు తెలంగాణా గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ కు మాత్రమే అనుమతినిచ్చారు. అటు ఏఐసీసీ కార్యాలయాన్ని కూడా టీ.ఉద్యోగ సంఘాల నేతలు ముట్టడించారు. ఇక్కడ కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు.

  • Loading...

More Telugu News