: ‘ధర్మయోగి’ని ఆన్ లైన్లో పోస్ట్ చేసిన పైరసీదారులు.. రంగంలోకి దిగిన పోలీసులు
ఆర్ఎస్ దురై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో ధనుష్, త్రిష జంటగా తమిళంలో విడుదలైన ‘కొడి’ చిత్రాన్ని తెలుగులో ‘ధర్మయోగి’గా విడుదల చేశారు. ఈ చిత్రానికి హిట్ టాక్ రావడంతో పైరసీదారుల దృష్టి ఈ చిత్రంపై పడింది. ఈ నేపథ్యంలో కొందరు పైరసీదారులు ఈ చిత్రాన్ని ఆన్ లైన్ లో పోస్ట్ చేశారు. ఈ సమాచారం తెలుసుకున్న నిర్మాత సిహెచ్ సతీష్ కుమార్ వెంటనే స్పందించారు. హైదరాబాద్ లోని యాంటీ పైరసీ సెల్ కు ఈ విషయమై ఫిర్యాదు చేశారు. దీంతో, రంగంలోకి దిగిన సంబంధిత అధికారులు ఆన్ లైన్లో ఉన్న ధర్మయోగి చిత్రాని తొలగించారు. ఈ పనికి పాల్పడింది ఎవరనే విషయమై ఆరా తీస్తున్నారు. ఏ ఐపీ అడ్రస్ ద్వారా ఈ చిత్రాన్ని పోస్ట్ చేశారనే విషయమై దర్యాప్తు చేస్తున్నారు.