: షారూక్ ఖాన్ మొదటి సంపాదన రూ.50!


ఈ రోజుతో 51వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ కు సామాజికి మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు వెల్లువెతుతున్నాయి. ఇటీవలే తన 25వ మ్యారేజ్ డే జరుపుకున్న షారూక్ ఖాన్ కెరీర్ టీవీ నటుడిగా ప్రారంభమైంది. ఆ తర్వాత సినిమాల్లో తన నటనా కౌశలంతో అభిమానులను తన సొంతం చేసుకుని బాలీవుడ్ బాద్ షా గా ఎదిగి, తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో షారూక్ ఖాన్ తన కెరీర్ ప్రారంభించకముందు జరిగిన కొన్ని ఆసక్తికర విషయాలు... * ఢిల్లీలో ప్రముఖ గజల్ గాయకుడు పంకజ్ ఉధాస్ కన్సర్ట్ జరిగిన సమయంలో ఆ కార్యక్రమాన్ని తిలకించేందుకు వచ్చిన వారికి సీట్లు చూపించడం. అందుకుగాను, షారూక్ ఖాన్ తీసుకున్న డబ్బులు రూ.50. ఇదే అతని మొట్టమొదటి సంపాదనట. * బ్లాక్ డ్రెస్సు అంటే ఇతనికి మహా ఇష్టం * ఇప్పటివరకు 14 ఫిల్మ్ ఫేర్ అవార్డులను దక్కించుకున్నాడు. * 2008 న్యూస్ వీక్ ప్రకారం ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైన 50 మంది వ్యక్తుల్లో షారూక్ కూడా ఒకడు. * మనదేశం తరపున పద్మశ్రీ, ఫ్రెంచ్ ప్రభుత్వం నుంచి రెండు ప్రతిష్టాత్మక అవార్డులు, ఎడిన్ బర్గ్ యూనివర్శిటీ డాక్టరేట్ అందుకున్నాడు

  • Loading...

More Telugu News