: పవన్‌ కల్యాణ్ తో మాకు విభేదాలు లేవు: టీడీపీ నేత బోండా ఉమా


జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్‌తో టీడీపీకి ఎలాంటి విభేదాలూ లేవని ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు అన్నారు. ఈ రోజు విజ‌య‌వాడ‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... ప్ర‌తిప‌క్ష‌పార్టీలు చేస్తోన్న విమ‌ర్శ‌ల‌ను తిప్పికొట్టారు. కాంగ్రెస్ పార్టీకి కాపుల గురించి మాట్లాడే నైతికహక్కు లేద‌ని, ఆ వ‌ర్గం వారిని బీసీల్లో చేరుస్తామని కాంగ్రెస్ పార్టీ 2004 ఎన్నిక‌ల మేనిఫెస్టోలో పేర్కొంద‌ని, ఆ తర్వాత ఆ అంశాన్నే ప‌ట్టించుకోలేద‌ని అన్నారు. త‌మ ప్ర‌భుత్వం ఈ అంశంపైనే కృషి చేస్తోంద‌ని బోండా ఉమా పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News