: ఇలాంటి స్టేజ్ లో మాస్ సినిమా ఏంటంటూ నాగచైతన్యను దిల్ రాజ్ తిట్టాడట!
పెద్ద మాస్ హీరో అయిపోయే సమయంలో, ఇలాంటి సినిమాలు ఎందుకు ఎంచుకున్నావంటూ ప్రముఖ నటుడు నాగచైతన్యను ప్రముఖ నిర్మాత దిల్ రాజు తిట్టాడట. ఈ విషయాన్ని స్వయంగా దిల్ రాజే తాజాగా చెప్పుకొచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే.. నాగచైతన్య నటించిన మొదటి సినిమా ‘జోష్’ నిర్మాత దిల్ రాజు. ఈ చిత్రం షూటింగ్ సమయంలో పిచ్చాపాటీగా మాట్లాడుకునేటప్పుడు తన రెండో చిత్రం ఒక ప్రేమకథ అని, గౌతమ్ మీనన్ దర్శకత్వం వహిస్తున్నాడని దిల్ రాజ్ కు చైతూ చెప్పాడు. దాంతో వెంటనే అందుకుని, "మన ‘జోష్’ సినిమా ‘శివ’ రేంజ్ లో హిట్ కొడుతుంది.. పెద్ద మాస్ హీరో అయిపోతావు.. ఇలాంటి సమయంలో లవ్ స్టోరీ ఏంటీ?" అంటూ చిన్న క్లాసు పీకానని దిల్ రాజ్ స్వయంగా చెప్పాడు. అయితే, 'జోష్' సినిమా పెద్ద ఫ్లాపవడం.. గౌతమ్ తో చేసిన 'ఏ మాయ చేసావే' పెద్ద హిట్టవడం మనకు తెలిసిందే!