: ప్రపంచంలోనే అతిపెద్ద డ్రగ్ రాకెట్ ఇది: డీఐఆర్ డైరెక్టర్ జనరల్


దేశంలోనే అతిపెద్ద డ్రగ్ రాకెట్ కేసులో బాలీవుడ్ నిర్మాత సుభాష్ డుడానిని పోలీసులు అరెస్టు చేసినట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ (సీబీఈసీ) చైర్మన్ నజీబ్ షా పేర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా, ఈ విషయమై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఐఆర్) డైరెక్టర్ జనరల్ జయంత్ మిశ్రా కూడా ఒక ప్రకటన చేశారు. అక్టోబరు 28న రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో 23,500 కిలోల నిషేధిత మాదక ద్రవ్యం అయిన మాండ్రాక్స్ టాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. వీటి విలువ సుమారు రూ.4,700 కోట్లు ఉంటుందని అంచనా వేశామన్నారు. దేశంలోనే కాకుండా, ప్రపంచంలోనే ఇదే అతిపెద్ద డ్రగ్ రాకెట్ కావచ్చన్నారు. మాండ్రాక్స్ టాబ్లెట్లను స్వాధీనం చేసుకున్న మర్నాడు ఈ కేసుతో సంబంధమున్న బాలీవుడ్ నిర్మాత సుభాష్ డుడానిని అరెస్టు చేసినట్లు చెప్పారు.

  • Loading...

More Telugu News