: ఆసుపత్రిలో పరామర్శ కుదరదని చెబుతున్నా రాహుల్ గాంధీ వినలేదు.. అందుకే అరెస్ట్: సీనియర్ పోలీస్ ఆఫీసర్ మీనా


వన్ ర్యాంక్ వన్ పెన్షన్ (ఓఆర్ఓపీ) కోసం పోరాడుతున్న మాజీ సైనికోద్యోగి రామ్ కిషన్ గ్రేవాల్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఢిల్లీ సీనియర్ పోలీస్ ఆఫీసర్ ఎంకే మీనా మీడియాతో మాట్లాడుతూ.. ఆసుపత్రి అంటే చ‌నిపోయిన వ్య‌క్తుల‌ కుటుంబాన్ని పరామర్శించే స్థ‌లం కాదని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ చెబితే వినిపించుకోలేద‌ని, అందుకే అదుపులోకి తీసుకున్నామ‌ని చెప్పారు. రాహుల్ గాంధీని మందిర్ మార్గ్ పోలీసు స్టేష‌నుకి త‌ర‌లించిన‌ట్లు చెప్పారు. మ‌రోవైపు ఆసుప‌త్రికి వ‌చ్చిన ఆప్ నేతలు అక్క‌డ‌ గందరగోళం సృష్టిస్తుండ‌డంతో వారిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు ఆయ‌న తెలిపారు.

  • Loading...

More Telugu News