: 'చాయ్ వాలా' సెన్సేషన్ క్రియేట్ చేశాడు... ఇప్పుడు అందమైన 'తర్కారివాలీ' వంతు


నీలికళ్ల చాయ్ వాలా పాకిస్థాన్ లో రాత్రికిరాత్రే సెలబ్రిటీగా మారడం తెలిసిందే. ఇస్లామాబాద్ లో చాయ్ అమ్ముకుని బతికే సాధారణ కుర్రాడు అర్షద్ ఖాన్ ఇప్పుడక్కడ ఓ సెలబ్రిటీ. 'పాక్ అణుబాంబు ఇతనే' అంటూ అతని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఇప్పుడు ఓ ముద్దుగుమ్మ వంతు వచ్చింది. కూరగాయలు అమ్ముకునే ఓ అందమైన నేపాలీ అమ్మాయి ఇప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఎంతో అందంగా ఉన్న ఆమె ఫొటోలు హల్ చల్ చేస్తున్నాయి. తర్కారివాలీ హ్యాష్ ట్యాగ్ తో ఈ ఫొటోలు బాగా షేర్ అవుతున్నాయి. రూపచంద్ర మహాజన్ అనే వ్యక్తి ఈ అమ్మాయి ఫొటోలను తీశాడు. చిత్వాన్ బ్రిడ్జ్, గోర్ఖా వద్ద చేపలు పట్టే ప్రదేశంలో ఆమె కూరగాయలు అమ్ముతుంటుంది. ఈ నేపాలీ అమ్మాయిపై నెటిజన్ల స్పందన చూద్దాం.

  • Loading...

More Telugu News