: ‘ఏ దిల్ హై ముష్కిల్’ను బహిష్కరించాలంటున్న గోవా డీజీపీ


‘ఏ దిల్ హై ముష్కిల్’ సినిమా విడుదల కాకముందు నుంచీ వివాదాలతో వార్తల్లో వుంది. భారత్,పాక్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అసలు ఈ సినిమా విడుదలవుతుందా? లేదా? అనే అనుమానాలు తలెత్తాయి. ఈ చిత్రం విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతున్న నేపథ్యంలో తాజాగా మరోవివాదం తెరపైకి వచ్చింది. ప్రఖ్యాత గాయకుడు మహ్మద్ రఫీని అవమానపరిచే విధంగా ఈ చిత్రంలో ఓ డైలాగ్ ఉందంటూ గోవా డీజీపీ ముఖేష్ చందర్ తాజా ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని బహిష్కరించాలంటూ ఆయన డిమాండ్ చేశారు. సంగీతాభిమానుల మనోభావాలు దెబ్బతినేలా ఈ డైలాగ్ ఉందని ఆయన ఆరోపిస్తున్నారు.

  • Loading...

More Telugu News