: ఇంటిపై ఎప్పుడు కావాలంటే అప్పుడు తక్షణ నగదు.. ఐసీఐసీఐ ఆఫర్


వేతన జీవులకు ఐసీఐసీఐ బ్యాంకు తాజాగా హోమ్ ఓవర్ డ్రాఫ్ట్ పేరుతో ఓ ఫథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని కింద ఇంటిని తనఖా ఉంచుకుని రూ.కోటి వరకు ఎంత కావాలంటే అంత, ఎప్పుడు కావాలంటే అప్పుడు తక్షణ ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం కింద నగదు పొందవచ్చు. అలాగే, టర్మ్ లోన్ సైతం తీసుకోవచ్చు. టర్మ్ లోన్ తీసుకుంటే వడ్డీ నెలవారీగా చెల్లించాల్సి ఉంటుంది. అదే ఓవర్ డ్రాఫ్ట్ అయితే, ఎన్ని రోజులు, ఎంత వాడుకుంటే ఆ మేరకు వడ్డీ వసూలు చేస్తారు. దీని కోసం బ్యాంకు చుట్టూ ప్రతిసారీ తిరిగే పని కూడా ఉండదు. జస్ట్ ఒకసారి బ్యాంకుకు ఇంటి రిజిస్ట్రేషన్ పత్రాలు అప్పగించి, డాక్యుమెంట్లపై సంతకం చేస్తే చాలు... ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని సేవింగ్స్ ఖాతాకు లింక్ చేస్తారు. దీంతో వారు వాడుతున్న ఖాతా నుంచే అవసరమైన సందర్భాల్లో ఎంత కావాలంటే అంత నగదు పొందవచ్చు. దీంతో అత్యవసర సందర్భాల్లో ఎవరి దగ్గర చేయి చాచే అవసరం ఏర్పడదు. కాకపోతే నెలవారీ వేతనం పొందే ఉద్యోగులు, వేతన ఖాతా ఉన్నవారు, అలాగే ఇంటిని కూడా కలిగి ఉంటేనే ఈ సదుపాయం పొందేందుకు అర్హులు.

  • Loading...

More Telugu News