: ప్రతీకారం తీర్చుకున్న భారత బలగాలు.. దాడుల్లో మృతుల సంఖ్య భారీగా ఉండవచ్చని మీడియాకు తెలిపిన బీఎస్ఎఫ్ ఐజీ
సరిహద్దుల్లో తరచూ కాల్పుల విరమణ ఉల్లంఘానికి పాల్పడుతూ, అకారణంగా భారత సైన్యంతో పాటు సరిహద్దు ప్రాంతాల ప్రజల ప్రాణాలు తీస్తోన్న పాకిస్థాన్ పై భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఇందుకు సంబంధించిన పలు వివరాలను, దృశ్యాలను బీఎస్ఎఫ్ ఐజీ డీకే ఉపాధ్యాయ విడుదల చేశారు. బీఎస్ఎఫ్ కేవలం పాకిస్థాన్ స్థావరాలపై మాత్రమే దాడులు చేసిందని ఆయన చెప్పారు. ఆ దాడుల్లో పాకిస్థాన్ పోస్ట్‌లు భారీగా ధ్వంసమయ్యాయని తెలిపారు. బీఎస్ఎఫ్ అత్యంత సమర్థవంతంగా జరిపిన ఈ దాడుల్లో మృతుల సంఖ్యపై స్పష్టంగా వివరాలు లేవని, అయితే, భారీగా ఉండవచ్చని ఆయన మీడియాకు తెలిపారు. భారత సైన్యం పాకిస్థాన్‌లోని సామాన్య పౌరులను మాత్రం ఎన్నటికీ టార్గెట్ చేసుకోదని వివరించారు.