: ఇంగ్లండ్ తో టెస్ట్ సిరీస్ కు భారత జట్టు ఎంపిక.. హార్దిక్ పాండ్యా ఎంట్రీ
ఇంగ్లండ్ తో జరగనున్న టెస్ట్ సిరీస్ కు భారత జట్టును ఎంపిక చేశారు. తొలి రెండు టెస్టులకు టీమిండియా జట్టును ప్రకటించింది బీసీసీఐ. సీనియర్ ఆటగాడు గౌతం గంభీర్ టెస్టు జట్టులో తన స్థానాన్ని కాపాడుకున్నాడు. కొత్త ఆటగాడు హార్దిక్ పాండ్యా టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. గాయం కారణంగా రోహిత్ శర్మ జట్టుకు దూరమయ్యాడు. భారత జట్టు ఇదే... విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్యా రహానే, ఛటేశ్వర్ పుజారా, గౌతం గంభీర్, మురళీ విజయ్, హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, అమిత్ మిశ్రా, రవీంద్ర జడేజా, వృద్ధిమాన్ సాహా, కరణ్ నాయర్, జయంత్ యాదవ్, మెహమ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, ఇషాంత్ శర్మ. ఈ నెల 9వ తేదీ నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది.