: దీపావళి వెళ్లి మూడు రోజులైనా ఢిల్లీ వాసులను వదలని కాలుష్యం


దీపావళి ముగిసి మూడు రోజులైనా ఢిల్లీ వాసులు మాత్రం ఇంకా కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. బుధవారం ఉదయం పలు ప్రాంతాల్లో దట్టమైన పొగ ఢిల్లీని కమ్మేసింది. ఎదురుగా ఉన్నవి కనిపించని పరిస్థితి నెలకొంది. దీపావళి రోజున కాల్చిన బాణసంచాకు తోడు విద్యుత్ ప్రాజెక్టులు, వాహనాలు విడుదల చేస్తున్న కాలుష్యం దీనికి కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. వాయు నాణ్యత ఢిల్లీలో బుధవారం ఉదయం 500 మార్క్ ను చేరినట్టు వాయు కాలుష్య వాతావరణ అంచనా సంస్థ (సఫర్) తెలిపింది. ముంబైలో ఇది 200లోపే ఉందని, అక్కడ కాలుష్యం అదుపులో వుందని వెల్లడించింది.

  • Loading...

More Telugu News