: ఫార్మా గోడౌన్ నుంచి మూడు వేల కోట్ల రూపాయల విలువ చేసే మాండ్రాక్స్ మాత్రలు స్వాదీనం!


రాజస్థాన్‌లోని ఓ ఫార్మా గోడౌన్ నుంచి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు ఈ రోజు భారీ మొత్తంలో మాండ్రాక్స్ మాత్రలను స్వాధీనం చేసుకున్నారు. గోడౌన్ నుంచి మొత్తం 23.5 మెట్రిక్ టన్నుల ట్యాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు సెంట్ర‌ర్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ క‌స్ట‌మ్స్(సీబీఈసీ) ఛైర్మ‌న్ న‌జీబ్ షా మీడియాకు తెలిపారు. స్వాధీనం చేసుకున్న మాత్ర‌ల‌ను మీడియా ఎదుట ప్ర‌వేశపెడుతూ... వీటి విలువ మొత్తం మూడు వేల కోట్ల రూపాయల వ‌ర‌కు ఉంటుందని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ముంబయి విమానాశ్ర‌యంలో సుబాష్ దుదాని అనే వ్య‌క్తిని అదుపులోకి తీసుకున్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. కేసులో ద‌ర్యాప్తు కొన‌సాగుతోంద‌ని చెప్పారు.

  • Loading...

More Telugu News