: లండన్ హీత్రూ విమానాశ్రయం సమీపంలో శవమై తేలిన భారతీయ మహిళ
పదిహేను రోజులుగా అదృశ్యమైన భారత సంతతి మహిళ ఆచూకీ లభించింది. లండన్ లోని హీత్రూ విమానాశ్రయం సమీపంలో ఆమె శవాన్ని పోలీసులు బుధవారం గుర్తించారు. హోటల్ హౌస్ కీపర్ గా పనిచేసే 30 ఏళ్ల ప్రదీప్ కౌర్ కనిపించకుండా పోయినట్టు ఆమె బంధువు గత నెలలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె చివరిగా గత నెల 16న కనిపించారు. అపరిచిత వ్యక్తి ఒకరు కౌర్ గొంతు నులిమి హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు. ఆమె విధులకు వెళుతున్న సమయంలో ఈ దాడి జరిగిందని పేర్కొన్నారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి, స్థానికులను విచారించిన అనంతరం పోలీసులు ఈ వివరాలు వెల్లడించారు. అయితే, హత్యకు గల కారణాలు ఇంకా వెల్లడి కాలేదు.