: ‘ఏవోబీ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులపై హత్య కేసులు నమోదు చేయాలి’.. ఎన్‌కౌంటర్‌కు నిరసనగా జంతర్ మంతర్ వద్ద ప్రజాసంఘాల ఆందోళన
ఇటీవల ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దు ప్రాంతం (ఏవోబీ) లో జరిగిన ఎన్‌కౌంటర్ పై ప్రజాసంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ఈ రోజు ఎన్‌కౌంటర్‌కు నిరసనగా ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ప్రజాసంఘాలతో పాటు కమ్యూనిస్టు పార్టీల నేతలు, పౌరహక్కుల కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులపై హత్యకేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసుల అదుపులో ఉన్న మావోయిస్టు నేతలను తక్షణం విడుదల చేయాలని కోరుతున్నారు. ఏవోబీలో చేసింది బూటకపు ఎన్‌కౌంటరేనని అన్నారు. ప్రొ.సాయిబాబా ఆధ్వర్యంలో ఈ ఆందోళన కొనసాగుతోంది. ఈ ఆందోళనలో మొత్తం 27 ప్రజా సంఘాలు పాల్గొంటున్నట్లు సమాచారం.