: హిల్లరీని ఆకాశానికెత్తిన ఒబామా... తనను ఉత్తమ అధ్యక్షుడిగా మార్చారని ప్రశంస
అమెరికా అధ్యక్ష పదవి నుంచి త్వరలో దిగిపోనున్న ఒబామా డెమోక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ను ఆకాశానికెత్తేశారు. ఆమె తనను ఓ మంచి అధ్యక్షుడిగా తీర్చిదిద్దారని ప్రశంసలు కురిపించారు. అయినప్పటికీ ఆ ఘనతను ఆమె సొంతం చేసుకోలేదన్నారు. తన పాలనలో విదేశాంగ మంత్రిగా విరామం లేకుండా ఆమె పనిచేశారని, కఠిన నిర్ణయాలు తీసుకున్నారని హిల్లరీ పనితీరును మెచ్చుకున్నారు. ఐసిస్ ను తుదముట్టించడానికి హిల్లరీ కమాండర్ ఇన్ చీఫ్ కావాలని ఆశించారు. అమెరికా ఎదుర్కొంటున్న సవాళ్లను ఆమె అర్థం చేసుకోగలరని, అలాగే ప్రపంచాన్ని కూడా ఆమె బాగా అర్థం చేసుకోగలరని ఒబామా పేర్కొన్నారు.