: సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ అమ్మాయిలను మోసం చేస్తోన్న కామాంధుడికి తగిన శాస్తి.. జుట్టు కత్తిరించి బుద్ధి చెప్పిన మహిళలు
కన్నడ సినీ పరిశ్రమలో అవకాశం ఇప్పిస్తానంటూ యువతుల జీవితాలతో ఆడుకుంటున్న ఓ యువకుడికి మహిళలు దేహశుద్ధి చేశారు. చీపుర్లు, కర్రలతో కర్ణాటకలోని శివమొగ్గ ప్రాంతంలోని ఆ కామాంధుడి ఇంటికి వెళ్లిన మహిళలు మరోసారి మోసాలకు పాల్పడతావా? అంటూ అతడి జుట్టు కత్తిరించారు. అనంతరం ఆ కామాంధుడి మెడలో తాళి వేసి, తలపై చున్నీ వేసి, చెప్పుతో, చేతులతో చితక్కొట్టి గట్టిగా బుద్ధి చెప్పారు. గత కొంతకాలంగా శివమొగ్గ పరిసర ప్రాంతాల్లో సదరు వ్యక్తి తనకు కన్నడ సినీ పరిశ్రమలోని ప్రముఖులు ఎంతో మంది తెలుసని చెప్పుకున్నాడు. సినీ పరిశ్రమలో ఎదగాలంటే ఇలాంటివి తప్పవంటూ యువతులను లొంగదీసుకునే వాడు. చివరికి ఒక అమ్మాయి ఈ విషయాన్ని తమ బంధువులకు చెప్పడంతో ఆ కామాంధుడి బండారం బయటపడింది. మీడియాతో సహా కామాంధుడి ఇంటికి చేరుకున్న మహిళలు అతడి భరతం పట్టారు. తీరా చూస్తే ఆ వ్యక్తికి సినీ పరిశ్రమలో కనీసం ఒక్కరితో కూడా పరిచయం లేదని తెలిసింది.