: జేఎన్‌టీయూకే ఇంజనీరింగ్ ప్రశ్నపత్రంలో 'లోకేష్ బ్యాంక్' అంటూ విచిత్ర ప్రశ్న!


జేఎన్‌టీయూకేలో ఇటీవ‌ల విద్యార్థుల‌కు నిర్వ‌హించిన ప‌రీక్ష‌లో విద్యార్థులకు ఓ విచిత్ర ప్ర‌శ్న ఎదుర‌యిన‌ట్లు తెలుస్తోంది. సోమ‌వారం ఆ వ‌ర్సిటీ ఇంజ‌నీరింగ్ విద్యార్థుల‌కు కంప్యూటర్ సైన్స్ సెకండియర్ ఫస్ట్ సెమిస్టర్ ప‌రీక్ష జ‌రిగింది. అయితే, ప్ర‌శ్న‌ప‌త్రంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కుటుంబానికి సంబంధించిన వ్యాపార సంస్థ‌ల పేర్లు క‌నిపించిన‌ట్లు స‌మాచారం. లోకేష్ బ్యాంక్, హెరిటేజ్ లిమిటెడ్, బ్రాహ్మణి లిమిటెడ్ అనే పేర్లు ప్రశ్నపత్రంలో క‌నిపించాయ‌ట‌. మేనేజేరియల్ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్సియల్ ఎనాలిసిస్ పరీక్ష ప్రశ్నపత్రంలో జర్నల్ ఎంట్రీ రికార్డింగ్ అంశానికి సంబంధించి ఇచ్చిన‌ ఓ ప్రశ్నలో ఈ పేర్లు క‌న‌ప‌డ్డాయి. ఇందులో లోకేష్ బ్యాంక్ అని క‌న‌ప‌డ‌డం మ‌రీ విచిత్రం. ఈ అంశంపై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని స‌ద‌రు వ‌ర్సిటీ వీసీ సంబంధిత విభాగాన్ని ఆదేశించిన‌ట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News