: ఐదేళ్ల తర్వాత బళ్లారిలో అడుగుపెట్టిన గాలి... బ్రహ్మరథం పట్టిన అభిమానులు
అక్రమ మైనింగ్ కేసులో జైలు జీవితం గడిపి, బెయిల్ పై బయటకు వచ్చిన గాలి జనార్దన్ రెడ్డి ఐదేళ్ల తర్వాత బళ్లారిలో అడుగుపెట్టారు. బెయిల్ పై బయటకు వచ్చినా, బళ్లారి వెళ్లకూడదంటూ కోర్టు షరతు విధించిన నేపథ్యంలో, ఆయన ఇంతవరకు బళ్లారి వెళ్లలేదు. తన కుమార్తె వివాహం నేపథ్యంలో, ఇప్పుడు ఆయన బళ్లారి వెళ్లారు. తొలుత ఆయన బళ్లారి సమీపంలోని చెల్లగుర్కి గ్రామానికి వెళ్లి అక్కడున్న ఎర్రితాత గుడిని సందర్శించుకున్నారు. అనంతరం బళ్లారిలోని దుర్గామాతను దర్శించుకుని, ఆ తర్వాత తన తల్లిదండ్రుల పేరుతో ఉన్న వృద్ధాశ్రమంకు వెళ్లి అక్కడున్న వృద్ధులను పరామర్శించారు. ఆ తర్వాత తన నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా బళ్లారిలో గాలి జనార్దన్ రెడ్డికి ఆయన అభిమానులు బ్రహ్మరథం పట్టారు.