: వైఫై కారణంగా తీవ్ర పరిణామాలు తప్పవు: ఆస్కార్ విన్నింగ్ సింగర్ అడెలె


గణనీయంగా అభివృద్ధి చెందిన‌ సాంకేతికత మ‌న జీవితాల‌పై ఎంతో ప్ర‌భావం చూపుతోంద‌ని ఆస్కార్ అవార్డు గ్రీహ‌త‌, సింగర్ అడెలె ఆవేద‌న వ్య‌క్తం చేసింది. మరో 25 ఏళ్లలో వై-ఫై టెక్నాలజీ అందరి మరణానికి కారణంగా నిలుస్తుందని ఆమె భావిస్తోంది. మనుషుల జీవితాలపై సాంకేతికత ఆధిపత్యం చెలాయిస్తోంద‌ని, ఈ ప‌రిణామం మంచిది కాదని ఆమె అభిప్రాయ‌ప‌డింది. ప్ర‌స్తుత కాలంలో ప్రజలు వారి ముందున్న క్షణాలను ఆస్వాదించకుండా, మొబైల్‌తో ఫొటోలు తీయడంపైనే త‌మ‌ దృష్టి సారిస్తున్నార‌ని చెప్పింది. గతంలో తాను స్టేజిపై షో చేస్తున్న సమయంలో అక్క‌డ‌కు వ‌చ్చిన అభిమానుల వ‌ద్ద‌ ఎక్కువగా మొబైల్ ఫోన్స్ ఉండేవి కావ‌ని అడెలె పేర్కొంది. అందుకే తాను వారి కోసం వేదిక‌పైకి వెళ్లేదాన్నని చెప్పింది. ప్ర‌స్తుతం తాను షో చేయ‌డానికి వెళుతోంటే ఫోన్ల కోసం వెళ్తున్నట్లుగా అనిపిస్తోంద‌ని పేర్కొంది. పెరిగిన టెక్నాల‌జీతో వాస్తవ ప్రపంచంలోకి జ‌నాలు చూడటం లేదని, ఫోన్లలోనే ఉంటున్నారని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేసింది. అందుకే తాను వైఫై కార‌ణంగా భ‌విష్య‌త్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయ‌ని అనుకుంటున్న‌ట్లు పేర్కొంది.

  • Loading...

More Telugu News