: పాకిస్థాన్ కు డెడ్లీ వార్నింగ్ ఇచ్చిన అరుణ్ జైట్లీ


దాయాది దేశం పాకిస్థాన్ కు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. పాక్ సైన్యం భారతీయులను చంపితే... భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ భారత శిబిరాలపై పాక్ సైన్యం దాడి చేస్తోందని... ఈ నేపథ్యంలో 14 పాకిస్థాన్ స్థావరాలను బీఎస్ఎఫ్ జవాన్లు ధ్వంసం చేశారని అన్నారు. ఇది పాకిస్థాన్ కు ఓ హెచ్చరిక అని చెప్పారు. పాక్ చర్యలను ఇకపై భారత్ ఉపేక్షించదని... సైన్యం దీటుగా సమాధానమిస్తుందని తెలిపారు. భారత సైన్యం సర్జికల్ దాడులను నిర్వహించిన తర్వాత కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ 60 సార్లు ఉల్లంఘించింది. దీనికి భారత సైన్యం కూడా దీటుగా సమాధానమిస్తోంది. మన జవాన్ల కాల్పుల్లో పాక్ రేంజర్లు అనేక మంది చనిపోయారు.

  • Loading...

More Telugu News