: ఏపీలో 4వ తేదీ నుంచి భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్ కు మరో ముప్పు పొంచి ఉంది. దక్షిణ అండమాన్ సముద్రంలో ఆగ్నేయ బంగాళాఖాతానికి ఆనుకుని నిన్న అల్పపీడనం ఏర్పడింది. మరో 24 గంటల్లో ఇది వాయుగుండంగా మారబోతోందని భారత వాతావరణ విభాగం ప్రకటించింది. వాయవ్య దిశగా ఇది పయనిస్తూ మరింత బలపడుతుందని తెలిపింది. దీని ప్రభావం 3వ తేదీ నుంచే కనిపిస్తుందని... 4వ తేదీ నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. సముద్రం అలజడిగా ఉంటుందని... తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని చెప్పింది. ఈ నేపథ్యంలో, మత్స్యకారులు చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లవద్దని సూచించింది. మరోవైపు, ఈశాన్య రుతుపవనాలు ఇరు తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించాయి.