: ఢిల్లీలో అగ్నిప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం, పదిమందికి గాయాలు


ఢిల్లీలో కొద్దిసేపటి క్రితం జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు సజీవ దహనమయ్యారు. మరో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈశాన్య ఢిల్లీలోని మోహన్ పార్క్ ప్రాంతంలోని ఓ భవనంలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. పార్కింగ్ ప్రదేశం నుంచి వచ్చిన మంటలు క్రమంగా అపార్ట్‌మొత్తం వ్యాపించాయి. పార్క్ చేసిన ఆటో రిక్షా నుంచి షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం సంభవించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయని, ఘటనలో ముగ్గురు మృతి చెందారని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News