: మనవడిని తిరుమల గర్భాలయంలోకి తీసుకెళ్లిన ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు.. టీటీడీ సంజాయిషీ నోటీసులు


తిరుమలలో జరిగిన ఘోర అపచారం ఆలస్యంగా వెలుగు చూసింది. తిరుమల బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సమయంలో ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు తన మనవడిని శ్రీవారి గర్భాలయంలోకి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో రమణ దీక్షితులకు టీటీడీ నోటీసులు జారీ చేసింది. మనవడిని గర్భాలయంలోకి తీసుకువెళ్లిన విషయమై వివరణ ఇవ్వాలని కోరారు. కాగా, సంప్రదాయాల గురించి చక్కగా చెప్పే రమణ దీక్షితులుకి, శ్రీవారి గర్భాలయంలోకి తన మనవడిని తీసుకువెళ్లకూడదన్న విషయం తెలియదా? అనే విమర్శలు తలెత్తుతున్నాయి.

  • Loading...

More Telugu News