: పాక్ లో ‘నికెలోడియన్’ ఛానెల్ ప్రసారాలపై వేటు!
భారత్ కు చెందిన కార్టూన్లను ప్రసారం చేశారంటూ పాక్ లో నికెలోడియన్ కార్టూన్ ఛానెల్ ప్రసారాలపై వేటు పడింది. భారత్ కు చెందిన కొన్ని డబ్బింగ్ కార్టూన్లను ‘నికెలోడియన్’ ప్రసారం చేసిందని పాకిస్థాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ (పెమ్రా) ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్ కి సంబంధించిన ప్రసారాలను అక్టోబర్ 19 నుంచి నిలిపివేయాలని పెమ్రా నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నికెలోడియన్ కార్టూన్ ఛానెల్ ప్రసారాలపై నిషేధం విధించింది.