: కాక్ పిట్ లో పైలట్ విపరీత చేష్టలు.. సస్పెన్షన్!
బ్రిటిష్ ఎయిర్ వేస్ లో కెప్టెన్ గా పనిచేస్తోన్న 51 సంవత్సరాల కొలిన్ గ్లోవర్ ఇటీవల విపరీత చేష్టలకు పాల్పడ్డాడు. బోయింగ్ 777 కాక్ పిట్ లో బట్టలు విప్పేసి, మహిళల సాక్స్ ధరించిన గ్లోవర్, కాళ్లతో విమానం నడిపాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అంతెేకాకుండా, కాక్ పిట్ లో పోర్న్ మ్యాగజైన్లు, చిందరవందరగా పడి ఉన్న పేకముక్కలు ఉండటాన్ని ఆయా ఫొటోలు ద్వారా గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆయన్ని సదరు సంస్థ సస్పెండ్ చేసింది. అయితే, ఈ ఆరోపణలను ఆయన ఖండించాడు. ఆ ఫొటోలు తనవి కావని చెబుతున్నాడు. దీంతో, ఈ వ్యవహారంపై బ్రిటిష్ ఎయిర్ వేస్ అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. కాగా, మధ్యతరహా విమానాలతో పాటు భారీ విమానాలను నడపడంలో గ్లోవర్ అనుభవశాలి.