: గ్యాస్ కు అధార్ ముడిపై నివేదిక ఇవ్వండి: హైకోర్టు
గ్యాస్ జారీని ఆధార్ తో ముడిపెట్టడంపై రాష్ట్ర హైకోర్టు స్పందించింది. దీనిపై వారంలోగా నివేదిక ఇవ్వాలంటూ చమురు సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
ఈ నెల 15 లోపు ఆధార్ నెంబర్ సమర్పిస్తేనే సబ్సిడీ గ్యాసు జారీ చేస్తామని, లేకుంటే సబ్సిడీ లేకుండా మార్కెట్ ధర చెల్లించాల్సి ఉంటుందని కంపెనీలు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఒక్కసారిగా భారీ సంఖ్యలో ప్రజలు ఆధార్ కోసం కేంద్రాలకు వస్తున్నారు. రద్దీ ఎక్కువై తోపులాటలు జరుగుతున్నాయి. ఇంత తక్కువ గడువు విధించడంపై ప్రజల నుంచి నిరసన కూడా వెల్లువెత్తుతోంది.