: దేశానికి ప్రత్యేకంగా ఏదో చేయాలని వీవీఎస్ లక్ష్మణ్ అనుకునేవాడు: సచిన్

టీమిండియా మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ ఈ రోజు పుట్టిన రోజు వేడుకను జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు క్రికెటర్లు, బాలీవుడ్ ప్రముఖులు ట్విట్టర్ ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. సచిన్ టెండూల్కర్ స్పందిస్తూ... లక్ష్మణ్‌ని ఓ అద్భుతమైన క్రీడాకారుడిగా అభివర్ణించాడు. లక్ష్మణ్ దేశానికి ప్రత్యేకంగా ఏదో ఒకటి చేయాలని అనుకునేవాడని సచిన్ పేర్కొన్నాడు. లక్ష్మణ్‌కి వీరేంద్ర సెహ్వాగ్, టీమ్ ఇండియా కోచ్ అనిల్ కుంబ్లే కూడా ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలుపుతూ ఆయనను కొనియాడారు. తాము గతంలో లక్ష్మణ్‌తో కలిసి తీసుకున్న ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా వీవీఎస్ లక్ష్మణ్‌కి బర్త్ డే విషెస్ చెబుతున్నట్లు పేర్కొన్నారు.