: చిక్కుల్లో పడ్డ పాక్ ప్రధాని... నవాజ్ షరీఫ్‌పై విచారణకు ఆదేశించిన పాక్ సుప్రీంకోర్టు
కొన్ని నెలల కిత్రం విడుదలైన పనామా పత్రాల్లో పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ పేరు బయటపడిన విషయం తెలిసిందే. దీంతో షరీఫ్‌తో పాటు ఆయన బంధువులపై కూడా విచారణ జరపాలని ఆ దేశ ప్రతిపక్ష పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్‌తో పాటు ఇతరులు పాకిస్థాన్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ రోజు షరీఫ్‌కి షాక్ ఇచ్చింది. కుంభకోణం, అవినీతి ఆరోపణలపై ఆయనపై విచారణకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది. షరీఫ్ కుటుంబసభ్యులు విదేశాల్లో నల్లధనం దాచుకున్నారని పనామా పత్రాల ద్వారా బయటపడిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టాలని తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్.. షరీఫ్‌పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. రేపు ఇస్లామాబాద్ ముట్టడికి కూడా పిలుపునిచ్చారు.