: యువకుల వేధింపులు తాళలేక ఉరివేసుకొని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
వరంగల్ గ్రామీణంలో ఈ రోజు దారుణం చోటు చేసుకుంది. ర్యాగింగ్ భూతానికి మరో విద్యార్థిని బలి అయింది. కమలాపూర్ మండలం దేశరాజుపల్లిలో యువకుల వేధింపులు తాళలేక ఇంటర్ విద్యార్థిని శివాని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కమలాపూర్‌లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో శివాని ఇంటర్ చదువుతోంది. విద్యార్థిని ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థినిని వేధించిన వారి కోసం ఆరా తీస్తున్నారు.