: నిరుద్యోగులకు శుభవార్త.. తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖలో 244 జూనియర్ అసిస్టెంట్ల పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
తెలంగాణలో నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. వాణిజ్య పన్నుల శాఖలో జూనియర్ అసిస్టెంట్ల పోస్టుల భర్తీకి అనుమతినిస్తూ ప్రభుత్వం ఈ రోజు మధ్యాహ్నం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారా ఆ శాఖలో మొత్తం 244 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రభుత్వ అధికారులు మీడియాకు తెలిపారు.