: చంద్రబాబు మాటలన్నీ బడాయేనని ఈ నివేదికతో తేలిపోయింది: వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి
సామాజిక అధ్యయనాల సంస్థ (సెస్) నివేదిక ద్వారా చంద్రబాబు మాటలన్నీ బడాయేనన్న విషయం తెలిసిపోయిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వైవీ విశ్వేశ్వరరెడ్డి అన్నారు. హైదరాబాద్ లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీ వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉందని ఈ నివేదిక బయటపెట్టిందన్నారు. ఏపీ రైతాంగం దారుణమైన పరిస్థితుల్లో ఉన్నట్లు సెస్ నివేదిక స్పష్టం చేసిందన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ఏపీ రైతులు అప్పుల్లో మునిగిపోయారని ఆ నివేదికలో పేర్కొంటే, రెండంకెల వృద్ధి రేటు అని, వ్యవసాయ మిషన్ అని చంద్రబాబు గొప్పలు చెబుతున్నారన్నారు. సెస్ నివేదికతో అయినా ప్రభుత్వం కళ్లు తెరవాలని, వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాలని విశ్వేశ్వరెడ్డి డిమాండ్ చేశారు.