: పాకిస్థాన్ బలగాల కాల్పుల్లో ఆరుకి చేరిన మృతుల సంఖ్య
సరిహద్దు ప్రాంతాల్లో పాక్ రేంజర్లు, భారత జవాన్లకు మధ్య కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. పాక్ రేంజర్లు జరిపిన కాల్పుల్లో మృతుల సంఖ్య ఆరుకి పెరిగింది. సాంబా జిల్లాలోని రామ్‌గఢ్ సెక్టార్‌లో పాక్ రేంజర్ల కాల్పులతో ఇద్దరు బాలురు మృతి చెందిన విషయం తెలిసిందే. అదే ప్రాంతంలో మరో యువతి, ఓ పౌరుడు తాజాగా ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు రాజౌరీ సెక్టార్‌లో పాక్ బలగాలు జరిపిన కాల్పుల్లో మరో ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. కాల్పుల్లో గాయాలయిన మరికొంతమందికి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది.