: పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంపై పెంటగాన్ ఆసక్తికర వ్యాఖ్యలు


పాకిస్థాన్ కేంద్రంగా సాగుతున్న ఉగ్రవాదుల కార్యకలాపాలతో ఆ దేశ ప్రజలకు మరింత నష్టం కలగనుందని, వీరి చర్యలు బయటి దేశాలకూ ముప్పేనని పెంటగాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఉగ్రవాదాన్ని తుదముట్టించడానికి పాక్ చేయాల్సింది ఎంతో ఉందని మీడియాకు వెల్లడించిన పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ పీటర్ కుక్, పాకిస్థాన్ తో అమెరికా సంబంధాలు కొనసాగడంపై కౌంటర్ టెర్రరిజంపై ఆ దేశపు వైఖరే కీలక పాత్ర పోషించనుందని ఆయన అన్నారు. టెర్రరిజం సమస్య నుంచి తన దేశ ప్రజలను కాపాడుకునేందుకు పాక్ ప్రభుత్వం పని చేయాలని కోరారు. ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు పాక్ చేస్తున్న చర్యలను ప్రస్తావించిన ఆయన, ఇంకా మరింతగా కృషి చేయాల్సి వుందన్నారు. పాకిస్థాన్ భద్రత, అణ్వాయుధాలు తదితర అంశాలపై తాము నిత్యమూ ఆ దేశపు అధికారులతో చర్చిస్తూనే ఉన్నామని తెలిపారు.

  • Loading...

More Telugu News