: రెచ్చిపోయిన పాకిస్థాన్ బలగాలు.. కాల్పుల్లో ఇద్దరు బాలుర మృతి.. మరో ఎనిమిది మందికి గాయాలు
సరిహద్దు ప్రాంతాల్లో పాక్ రేంజర్లు కవ్వింపు చర్యలను కొనసాగిస్తూనే ఉన్నారు. భారత్ ఆ దాడులను తిప్పికొడుతూ గట్టిగా బుద్ధి చెబుతోన్నా పాకిస్థాన్ తన తీరు మార్చుకోవడం లేదు. రెచ్చిపోయి మరీ కాల్పులు జరుపుతూ సామాన్యులను బలిగొంటోంది. ఈ రోజు పాక్ బలగాలు జమ్ముకశ్మీర్‌లోని సాంబా, నౌషేరా ప్రాంతాల్లో కాల్పులకు తెగబడుతోన్న విషయం తెలిసిందే. ఆయా ప్రాంతాల ప్రజలను భారత బలగాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. అయితే, సాంబా ప్రాతంలోని రామ్‌గఢ్ సెక్టార్‌లో పాక్ రేంజర్ల కాల్పులలో ఇద్దరు బాలురు మృతి చెందారు. మరో 8 మందికి గాయాలయ్యాయి.