: ఈ నెల 20 నుంచి అంతర్జాతీయ చలన చిత్రోత్సవం.. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి సెంటనరీ అవార్డు: వెంకయ్య నాయుడు


ఈ నెల 20 నుంచి గోవాలో అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ప్రారంభమవుతుందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. ఈరోజు ఆయ‌న ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ చిత్రోత్స‌వంలో మొత్తం 88 దేశాల నుంచి ప్ర‌తినిధులు, క‌ళాకారులు హాజ‌రై 194 చిత్రాలు ప్రదర్శిస్తార‌ని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో జీవిత‌కాల సాఫ‌ల్య పుర‌స్కారం అందుకోనున్న వారికి రూ.10 లక్షల నగదు బహుమతిని ప్ర‌దానం చేయ‌నున్న‌ట్లు తెలిపారు. అందులో ప్ర‌ముఖ‌ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి సెంటనరీ అవార్డు బ‌హూక‌రించ‌నున్న‌ట్లు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News