: విశాఖ పిచ్ అలాంటిది బాబూ.. ఇంగ్లండ్ తో టెస్టు మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగుస్తుందంటున్న మాజీ క్రికెటర్!
విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో పిచ్ లను నాసిరకంగా తయారు చేశారన్న ఆరోపణలు వస్తున్న వేళ, ఈ నెల 17 నుంచి ఇంగ్లండ్ తో జరగబోయే రెండో టెస్టు క్రికెట్ పోటీ ఐదు రోజులకు బదులుగా రెండు రోజుల్లోనే ముగుస్తుందని ఓ మాజీ క్రికెటర్ వ్యాఖ్యానించాడట. గత వారంలో న్యూజిలాండ్ తో జరిగిన ఐదో వన్డేలో స్వల్ప వ్యవధిలో న్యూజిలాండ్ ఆటగాళ్లు అవుట్ కావడం, అంతకుముందు ఇదే స్టేడియంలో జరిగిన అసోం - రాజస్థాన్ రంజీ మ్యాచ్ లో ఒక్క రోజే 17 వికెట్లు కుప్పకూలడం వంటి పరిస్థితిని గమనిస్తే, ఈ పిచ్ పై వికెట్లు టపటపా రాలుతాయన్న అభిప్రాయాన్ని తన స్నేహితుల వద్ద సదరు క్రికెటర్ వ్యక్తం చేశారట. పిచ్ వివాదంపై ఏసీఏ కార్యదర్శి గోకరాజు స్పందిస్తూ, రంజీ ఆడిన పిచ్, వన్డే ఆడిన పిచ్ ఒకటి కాదని, టెస్టు కోసం మరో పిచ్ ని సిద్ధం చేస్తున్నామని వివరించారు.