: రాగల 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌కి వర్ష సూచన
రాగల 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దక్షిణ అండమాన్ సముద్రంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం బలపడి ఈరోజు మధ్యాహ్నానికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారుతుందని పేర్కొన్నారు. మరోవైపు ఉత్తర బంగాళాఖాతంలోనూ మరో ఆవర్తనం సముద్రమట్టానికి 2.1 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని చెప్పారు. తమిళనాడుపై మరో ఉపరితల ఆవర్తనం ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు. వీటి కారణంగా రాష్ట్రంలోని పలుచోట్ల వర్షాలు కురుస్తాయని చెప్పారు. కాగా, ఈనెల 7 నుంచి వర్షాలు జోరుగా కురిసే అవకాశం ఉందని చెప్పారు.