: తన పిల్లలకు భారత సంప్రదాయ దుస్తులేసి మెరిసిన పొలార్డ్... మీరూ చూడండి!


ఐపీఎల్ పుణ్యమాని భారత క్రికెట్ అభిమానులకు పరిచితమైన వెస్టిండీస్ క్రికెటర్ కీరన్ పొలార్డ్, ఈ దీపావళి పర్వదినాన్ని వైభవంగా జరుపుకున్నాడు. తన కుమారుడు, కుమార్తెకు భారత సంప్రదాయ దుస్తులేసి, తాను కూడా అవే ధరించి పండగను సెలబ్రేట్ చేసుకున్నట్టు చెప్పాడు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో ఓ ఫోటోను పెట్టాడు. ఇక న్యూజిలాండ్ సిరీస్ ముగిసిన తరవాత ఎవరింటికి వారు చేరిన క్రికెటర్లు పండగ వేడుకల్లో మునిగిపోయారు. తన భర్త ధోనీ, కుమార్తె జీబాతో కలసి దీపావళి వేడుకలు జరుపుకుంటున్న ఫోటోను సాక్షి సోషల్ మీడియాలో పెట్టింది. అజింక్య రహానే, తన భార్య వేసిన ఓ ముగ్గు చిత్రాన్ని పోస్టు చేసి శుభాకాంక్షలు చెప్పగా, హర్భజన్, వీవీఎస్ లక్ష్మణ్, రోహిత్ శర్మ తదితరులు అభిమానులకు విషెస్ చెప్పారు.

  • Loading...

More Telugu News