: విజయవాడకు వచ్చి అదృశ్యమైన శ్రీలంక జాతీయుడు


నవ్యాంధ్ర నూతన రాజధాని ప్రాంతానికి వచ్చిన శ్రీలంక జాతీయుడు అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. శ్రీలంక హైకమిషన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు ప్రారంభించారు. గత నెల 15వ తేదీన చెన్నై నుంచి తమిళనాడు ఎక్స్ ప్రెస్ రైలులో శ్రీలంకకు చెందిన స్టీవెన్ రత్నాయక్ అనే వ్యక్తి వచ్చాడు. విజయవాడ రైల్వే స్టేషన్లో అతను మాయం అయ్యాడు. స్టీవెన్ ఏ పనిమీద వచ్చాడన్న విషయమై పోలీసుల వద్ద స్పష్టమైన సమాచారం లేదు. అతని ఉద్యోగం ఏంటన్న విషయం కూడా తెలియరాలేదు. స్టీవెన్ రైల్వే స్టేషన్ నుంచి ఎటు వెళ్లాడన్న విషయాన్ని తేల్చేందుకు సమీపంలోని అన్ని సీసీటీవీ కెమెరాల దృశ్యాలనూ పరిశీలించాలని పోలీసు వర్గాలు నిర్ణయించాయి.

  • Loading...

More Telugu News