: హైదరాబాద్ అల్వాల్‌లో బీభత్సం సృష్టించిన కారు
హైదరాబాలోని అల్వాల్ లో మద్యం సేవించిన యువకుడు డ్రైవింగ్ చేయడంతో రోడ్డుపై ఓ కారు బీభత్సం సృష్టించింది. కారును అతివేగంగా నడుపుతూ మూడు ద్విచక్రవాహనాలను ఢీకొట్టాడు. సమాచారం అందుకున్న పోలీసులు కారులో ఉన్న ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. కారులో ఉన్న ఇద్దరు యువకులు మద్యం సేవించారని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనలో వారిద్దరితో పాటు ఇద్దరు ద్విచక్ర వాహనదారులు కూడా గాయాలపాలయినట్లు పేర్కొన్నారు. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. యువకులు సిద్ధిపేట నుంచి హైదరాబాద్‌కి వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.