: ప్రభాస్, చిరంజీవి ఆలింగనం చేసుకున్న ఫోటో పెట్టి.. కమ్మ, కాపు క్యాస్ట్ ఫీలింగ్స్ రెచ్చగొట్టిన రాంగోపాల్ వర్మ!


తన ట్వీట్లతో వివాదాలు కొని తెచ్చుకునే దర్శకుడు రాంగోపాల్ వర్మ, ఈ సారి పెద్ద వివాదాన్నే తెరపైకి తెచ్చాడు. మెగాస్టార్ చిరంజీవి, బాహుబలి స్టార్ ప్రభాస్ ఆలింగనం చేసుకుంటున్న ఫోటోను పెట్టి, కులాల కుంపటిని రగిల్చాడు. "చిరంజీవి మనస్ఫూర్తిగా ప్రభాస్ ను.. ప్రభాస్ మనస్ఫూర్తిగా చిరంజీవిని కౌగిలించుకున్నారని ఎవరైనా నమ్మితే అది వారి మూర్ఖత్వమే"నని పెట్టిన ట్వీట్ కు విపరీతమైన స్పందన రాగా, తన ఉద్దేశాన్ని బట్టబయలు చేస్తూ మరిన్ని ట్వీట్లు చేశాడు. తాను ప్రభాస్ ను ప్రేమిస్తానని, చిరంజీవిని ద్వేషించీ ప్రేమించడాన్ని కూడా ప్రేమిస్తానని చెప్పిన ఆయన, ఒట్టి బడుద్ధాయిలకు మాత్రం ఇది అర్థం కాదని చెప్పుకొచ్చాడు. కాపులపై చిరంజీవికి కులాభిమానం లేనంతటి స్థాయిలో.. తనకు ప్రభాస్ పై కులాభిమానం వుందని, కేవలం కమ్మవారు మాత్రమే దీనికి జవాబు చెప్పగలరని వర్మ కాస్త గజిబిజిగా ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్లపై అభిమానులు తిట్ల దండకం అందుకోవడంతో, చాలా మంది అభిమానులు తన ఇంగ్లీష్ ను అర్థం చేసుకోలేరని వాళ్లను క్షమిస్తున్నానని చెప్పాడు.

  • Loading...

More Telugu News