: తన్నుకున్న టీడీపీ, వైసీపీ వర్గీయులు... 10 మందికి గాయాలు
టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య జరిగిన దాడిలో 10 మంది గాయపడ్డారు. ఈ ఘటన గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం కోమటినేనివారి పాలెంలో ఈ తెల్లవారుజామున చోటుచేసుకుంది. పాత కక్షల నేపథ్యంలోనే, ఈ ఘర్షణ జరిగిందని చిలకలూరిపేట రూరల్ సీఐ శోభన్ బాబు తెలిపారు. గాయపడిన వారిలో అంజయ్య, యలమంద, కుమార్, వీరయ్య, శ్రీను తదితరులు ఉన్నారు. గాయపడిన వారందరినీ చిలకలూరిపేట, నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. ఘర్షణ మరింత పెరిగే అవకాశం ఉండటంతో గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేసినట్టు సీఐ తెలిపారు.