: పాక్ కాల్పుల్లో 19 ఏళ్ల యువతి మృతి.. ముగ్గురికి గాయాలు.. బందిపొరాలో ఉగ్రవాదులతో కొనసాగుతున్న ఎన్కౌంటర్
కాల్పుల విరమణ ఒప్పందాన్ని యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్న పాకిస్థాన్ తాజాగా ఈ రోజు జమ్ముకశ్మీర్‌లోని సాంబా సెక్టార్లో మోర్టార్లతో విరుచుకుపడింది. పాక్ కాల్పుల్లో 19 ఏళ్ల యువతి మృతి చెందగా మరో ముగ్గురు గాయపడ్డారు. పాక్ కాల్పులను భారత బలగాలు సమర్థంగా తిప్పికొడుతున్నాయి. పాక్ కాల్పుల్లో గాయపడిన ముగ్గురిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మరోవైపు బందిపొరాలోని అజార్ గ్రామంలో ఉగ్రవాదులకు, సైన్యానికి మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం సర్జికల్ దాడులు జరిపిన తర్వాత పాక్ ఇప్పటి వరకు 45 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.