: మా సైనికుడిని విడుదల చేయండి.. పాక్‌ను కోరనున్న భారత్


పాకిస్థాన్ చెరలో ఉన్న భారత సైనికుడి విడుదల కోసం భారత ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అతడిని విడుదల చేయాల్సిందిగా పాక్‌ను కోరనుంది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ సర్జికల్ దాడులు నిర్వహించిన సెప్టెంబరు 29న భారత జవాను చందు బాబులాల్ చవాన్ పొరపాటున నియంత్రణ రేఖను దాటాడు. అతడిని పాక్ సైన్యం పట్టుకుంది. చవాన్‌ను విడిచిపెట్టాల్సిందిగా ఇప్పటికే భారత ఆర్మీ మిలటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్(డీజీఎంవో) రణబీర్ సింగ్ పాక్ డీజీఎంవోను కోరారు. అయితే ఆయన అభ్యర్థనకు పాక్ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. దీంతో స్పందించిన ప్రభుత్వం ఈ విషయాన్ని పాక్ విదేశీ మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించింది.

  • Loading...

More Telugu News